ఎంవీఎస్ఆర్ బాధిత కుటుంబానికి కోటి పరిహారమివ్వాలి
దుర్ఘటనపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి.. ఎమ్మెల్సీ దాసోజు డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబురాల సందర్భంగా యాజమాన్య నిర్లక్ష్యం, భద్రతా చర్యల లో పం కారణంగా చోటుచేసుకున్న ప్రమాదంలో సోని మృతిచెందడం, మరో వి ద్యార్థిని మీన తీవ్రంగా గాయపడటం తీవ్ర విషాదకరమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
వేలాది మంది హా జరైన ఈ వేడుకల్లో అగ్నిమాపక భ ద్రత, తొకిసలాట నివారణ, అత్యవసర వైద్య సదుపాయాలు ఏర్పాటు చే యకపోగా, పోలీస్, మున్సిపల్ అనుమతులు లేకుండానే కార్యక్రమం ని ర్వహించారని ఆరోపించారు. రెకలు ముకలు చేసుకుని పిల్లలను చదివిస్తున్న పేద కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేస్తూ, విద్యాసంస్థలు విద్యను వినోదంగా, వ్యాపారంగా మారుస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటం క్షమించరాని నేరమని అదివారం శ్రవణ్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు.
ఈ దుర్ఘటనపై తక్షణమే ఉన్నత స్థాయి ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారితో నిష్పాక్షిక విచారణ జరిపించాలని, ప్రమాదానికి కారణమైన కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, నిర్వాహకులపై బీఎన్ఎస్ కఠిన సెక్షన్ల కింద నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం రేవంత్రెడ్డిని డిమాండ్ చేశారు.
మృతిచెందిన విద్యార్థిని కుటుంబానికి కళాశాల నిధుల నుంచి రూ. కోటి పరిహారంతోపాటు ప్రభుత్వ ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, గాయపడిన విద్యార్థినికి కా ర్పొరేట్ దవాఖానలో ఉచిత వైద్యం అందించాలని కోరారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన కళాశాల గుర్తింపును తాతాలికంగా రద్దు చేయడమో లేదా భారీ జరిమానా విధించడమో చే యాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాసంస్థల్లో ఈవెంట్లకు కఠిన నియమాలు అమలు చేయాలని విజ్ఞప్తిచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

