దసరా సందడి నిల్
దసరా రోజున ఏ కార్యం చేపట్టిన దిగ్విజయంగా పూర్తవుతుందనే సెంటిమెంట్‌కు కాంగ్రెస్ సర్కార్ బ్రేక్ చేసింది.
- అమ్మకాలు లేక రియల్ ఎస్టేట్ వెలవెల
- గోరు చుట్టులా మారిన 22ఏ, కాంగ్రెస్ విధానాలు
- అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
- సర్కార్ చర్యలతో కోలుకోలేని నగర రియల్ ఎస్టేట్
సిటీబ్యూరో, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ) : దసరా రోజున ఏ కార్యం చేపట్టిన దిగ్విజయంగా పూర్తవుతుందనే సెంటిమెంట్‌కు కాంగ్రెస్ సర్కార్ బ్రేక్ చేసింది. పండుగ రోజున సొంతింట్లో అడుగు పెట్టేవారు, డ్రీమ్ హోంకు భూమి పూజ చేసుకునేవారు, చివరకు కొత్తగా స్లాబ్ పనులు చేసే వారు కూడా దసరా పండుగ రోజున చేయడానికి ప్రాధాన్యతనిస్తారు.
కానీ గడిచిన మూడేండ్ల నుంచి నగరంలో ఆ సందడి లేకుండా పోయింది. దీంతో ఏటా దసరా సందడి రియల్ ఎస్టేట్ రంగంలో కనిపించకుండా పోయింది. ఆరు నెలల ముందు నుంచే రియల్ ఎస్టేట్ లావాదేవీలన్నీ పడిపోగా, కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు భూమి పూజ లేకుండా చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపలేదు. నగరంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే రియల్ ఎస్టేట్ రంగాన్ని సంక్షోభాన్ని నెట్టివేసింది. చెరువులు, కుంటల సంరక్షణ పేరిట ఆక్రమణలను తొలగిస్తున్నామని చెప్పి..పేదల ఇండ్లను కూల్చివేయడంతో నగరంలో రియల్ రంగాన్ని ఆందోళన మొదలైంది. ఆ తర్వాత పాలన సంస్కరణల పేరిట తీసుకువచ్చిన భూ భారతి, బిల్డ్ నౌ గందరగోళాన్ని సృష్టించాయి.
ఇక కోలుకునే లోపే రియాల్టీపై 22ఏ పిడుగేసిన కాంగ్రెస్ సర్కార్.. దశల వారీగా ఈ రంగాన్ని నిర్వీర్యం చేసే . విధానాలను పకడ్బందీగా అమలు చేస్తోంది. ఇక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణ అనుమతుల్లో సాగుతున్న అక్రమ కార్యకలాపాలతో వ్యాపారులే భయపడిపోతున్నారు. దీంతో కట్టిన ఇండ్లను అమ్ముకోలేక, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోలేక రియల్ వ్యాపారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది.
కనిపించని దసరా సందడి
దసరా వచ్చిందంటే నగరం చుట్టూరా వందలాది వెంచర్లు శంకుస్థాపనలు, భూమి పూజలతో కళకళలాడేవి. కానీ హైడ్రా కూల్చివేతలతో మొదలైన సర్కారు విధానాలతో జనాలు, బిల్డర్లు, డెవలపర్లు కూడా కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లేందుకు జంకుతున్నారు. ఒకప్పుడు దసరా వచ్చిందంటే నగరంలో నిర్మాణం పూర్తైన ప్రాజెక్టులను కొనుగోలుదారుల చేతికిచ్చేవి 15వేలకు పైగా ఉండేవి.
ఇక కొత్త రిజిస్ట్రేషన్లు కూడా 10వేలకు పైగా జరిగేవి. కానీ ఈ గణాంకాలు అన్ని కనుమరుగైపోయాయి. ఇక వందలాది వెంచర్లకు భూమి పూజలతో సందడిగా ఉండే శివారు ప్రాంతాల్లో మార్కెట్ లేక వ్యాపారులు దిగాలుగా ఉన్నారు. కనీసం పండుగ పూట రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును తీసుకు రాలేకపోయామని ఎంతో మంది వ్యాపారులు ఉన్నారు.
నీరుగారిపోతున్న ఆశలు
దసరా నాటికి నగరంలో వ్యాపారం గాడిలో పడుతుందని భావించారు. వ్యాపారులు కూడా అదే అంచనా వేశారు. దానికి తగినట్లుగానే తెలంగాణ సర్కార్ ఫోర్త్ సిటీ పేరిట హడావుడి చేసింది. కానీ క్షేత్రస్థాయిలో కొనుగోలుదారుల్లో కొరవడిన విశ్వాసం, మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.
అదేవిధంగా గడిచిన మూడేండ్లుగా పడిపోయే ఉన్నా.. మార్కెట్‌తో వ్యాపారులు, కొనుగోలుదారుల చేతుల్లో డబ్బుల లావాదేవీలు లేకుండా పోయాయి. ఇక వాణిజ్యపరమైన లావాదేవీలు కూడా ముందుకు సాగే పరిస్థితి లేదు. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలతో ఇటీవల హెచ్ఎండీఏ నిర్వహించిన వేలానికి కూడా స్పందన లేకుండా పోయింది. రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం అతలాకుతలం చేస్తోంది. 22ఏతో భూ యజమానులకు చేసిన గాయాలు మానకపోగా, రాచపుండులా మారి వేలాది ఆస్తులపై హక్కులను కాలరాస్తోంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

