Dasara Movie | ఒకప్పుడు వరుస హిట్లతో చెలరేగిపోయినా నాని.. ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. గత రెండుమూడేళ్లుగా నాని నుంచి ఆశించిన స్థాయి సినిమాలు రావడంలేదు. దాంతో నాని అభిమానులు ఆయన కంబ్యాక్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నాని కూడా తన కంఫర్ట్ జానర్ నుంచి బయటకు వచ్చి దసరా అనే అవుట్ అవుట్ మాస్ కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులు మెప్పు పొందడానికి ముస్తాబవుతున్నాడు. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 30న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుతూ వస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
‘చంకీలా అంగిలేసి’ అంటూ సాగే పాటను మార్చి 8న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నాని, కీర్తి సురేష్ స్కూటర్‌పై వెళ్తున్న పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే రిలీజైన ధూమ్ ధామ్ ధోస్తాన్, ఓరి వారి పాటలకు శ్రోతల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక ఈ పాట కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందని మేకర్స్ థీమా వ్యక్తం చేస్తున్నారు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
— Nani (@NameisNani) March 3, 2023
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన దసరా సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్ నటిస్తుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం. టాలీవుడ్లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం దసరా సినిమాకు అన్ని హక్కులకు కలిపి రూ.80 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమా బడ్జెట్ రూ.65 కోట్లు ఈ లెక్కన చూసుకుంటే నిర్మాతలు ఆల్రెడీ రూ.15 కోట్ల ప్రాఫిట్లో ఉన్నట్టే. ఇక నాని మొదటి సారి ఫుల్ లెంగ్త్ ఊరమాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది.