హీరో శర్వానంద్ నటిస్తున్న ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్‌నంది దర్శకుడు. కేకే రాధామోహన్ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా ఈసినిమా టీజర్‌ని ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. గ్రామీణ జానపద శైలిలో సాగే వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలైంది. బొగ్గుల గుట్ట అనే గ్రామాన్ని అక్కడి నాగరికతనూ, పగలు, ప్రతీకారాలు, భక్తి, మూఢ విశ్వాసాల నేపథ్యంలో టీజర్ సాగింది. శర్వా రఫ్ అండ్ రగ్డ్ లుక్‌లో మట్టితో మమేకమైన ఓ సాధారణ కూలీగా కనిపించారు.
అనుపమ పరమేశ్వరన్ పాత్ర కూడా సీరియస్ మోడ్‌లో ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నది. 1960ల ప్రారంభంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని ఓ కల్పిత గ్రామం నేపథ్యంలో సాగే ఈ కథను దర్శకుడు సంపత్‌నంది ఎంతో సహజంగా, నేటివిటితో తెరకెక్కిస్తునట్టు టీజర్ చెబుతున్నది. రా, ఇంటెన్స్, రూటెడ్ ప్రపంచాన్ని టీజర్ ఆవిష్కరించింది. డింపుల్ హయాతీ మరో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కిశోర్‌కుమార్ అరోకియా, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, నిర్మాణం: శ్రీసత్యసాయి ఆర్ట్స్.