విశ్వక్సేన్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘కల్ట్’. తారక్ సినిమా పతాకంపై సందీప్ కాకరాల భారీ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ని పూర్తి చేసుకున్నది. హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో నిర్మించిన భారీసెట్లో వందలాది మోడల్స్‌తో 40-50 రోజుల పాటు జరిగిన కీలక సన్నివేశాల చిత్రీకరణతో షూటింగ్ పూర్తయిందని మేకర్స్ తెలిపారు.
భారతీయ భాషలతోపాటు విదేశీ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నామని, ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా ‘కల్ట్’ విడుదల కానున్నదని మేకర్స్ చెప్పారు. గాయత్రి భరద్వాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, తారక్ పొన్నప్ప, ప్రజ్ఞ ఇతరపాత్రధారులు. ఈచిత్రానికి మాటలు: తరుణ్‌భాస్కర్, సౌండ్ డిజైన్: ‘యానిమల్’ఫేం సచిన్.