తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో ఓ పెళ్లి చుట్టూ జరిగే కథతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘క్రేజీ కల్యాణం’. అనుపమ పరమేశ్వరన్, తరుణ్‌భాస్కర్, నరేష్ వీకే, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. భద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రేమ, పెళ్లి, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో హాస్యం, భావోద్వేగాల కలబోతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని మేకర్స్ తెలిపారు. శనివారం ఈ సినిమా నుంచి ‘అల సెంద్రవంక’ అనే రెండో పాటను విడుదల చేశారు.
ప్రముఖ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న రచించిన ఈ గీతానికి సురేష్ బొబ్బిలి స్వరాల్ని అందించారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ‘అందం మురిసే, గంధం కురిసే పిల్లా నీ మేని సొగసులనే చూసి, వేకువలోనా వెన్నెల కాసి, పిల్లా నీ పెదవులపై నవ్వై పూసే, నీ అడుగులతోనే అవనే పులకించే, నీ తనువును తాక మేఘం తలవంచే, సింగిడి రంగులలో పొంగే ఆకాశం’ అంటూ అందమైన భావాలతో ఈ పాట సాగింది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ దూపాటి, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: భద్రప్ప గాజుల.