ప్రస్తుతం సాయిపల్లవికి మహర్దశ నడుస్తున్నది. ఒక కథానాయికగా దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు రావడం అరుదైన విషయం. అన్ని భాషలకు చెందిన ప్రేక్షకులూ తమ హీరోయిన్గా ఓన్ చేసుకోవడం ఈ మధ్య సాయిపల్లవి విషయంలోనే జరిగిందని చెప్పక తప్పదు. వచ్చే నెలలో రెండు వారాల తేడాతో ఆమె సినిమాలు రాబోతున్నాయి. వాటిలో మొదటిది నితీష్ తివారీ ‘రామాయణ: పార్ట్ 1’. ఈ పాన్ ఇండియా పౌరాణిక దృశ్యకావ్యంలో సాయిపల్లవి సీతామహాసాద్విగా కనిపించనున్నారు.
సరిగ్గా ఈ సినిమా విడుదలైన రెండు వారాలకు, అంటే.. నవంబర్ 20న ధనుష్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓం: చాప్టర్ 1’ విడుదల కానున్నది. ఇందులో సాయిపల్లవిది కీలకమైన పాత్ర. యాక్షన్, ఎమోషన్స్‌తో ఆమె పాత్ర సాగుతుందని సమాచారం. రెండు వారాల గ్యాప్‌తో రెండు పొంతన లేని పాత్రల ద్వారా ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని సాయిపల్లవి పంచనున్నదని సినీవర్గాలు అంటున్నాయి. ఈ ప్రయత్నాలు రెండూ ఫలిస్తే.. సాయిపల్లవి క్రేజ్ దేశవ్యాప్తంగా మరింత పెరగడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.