
జి.వెంకటకృష్ణన్(జీవీకే) దర్శకత్వంలో రూపొందుతున్న ‘డామిట్.. డేవిడ్‌రాజుకు పళ్లైపోయింది’ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కిరణ్‌కుమార్ గుడిపల్లి, కె.రామచంద్రారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘కుటుంబ బంధాలకు వినోదాన్ని జోడిస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. డేవిడ్ రాజు పెళ్లి హంగామా ఏమిటన్నది కడుపుబ్బా నవ్విస్తుంది. పాటల రికార్డింగ్ ప్రారంభించాం. త్వరలో నటీనటుల వివరాల్ని వెల్లడిస్తాం’ అని అన్నారు. ప్రముఖ హీరోయిన్ అతిథి పాత్రలో నటించనుందని, త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జె ప్రభాకర్‌రెడ్డి, సంగీతం: ఎమ్.ఎల్ రాజా.