హూస్టన్: అమెరికాలోని టెక్సాస్‌లో కాల్పుల(Texas Shooting) ఘటన జరిగింది. ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతిచెందగా, మరో పది మంది గాయపడ్డారు. పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో అనుమానిత షూటర్ హతమయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున వెస్ట్ టెక్సాస్ మిడ్‌లాండ్ ఆయిల్ సిటీలో ఈ ఘటన జరిగింది. షూటింగ్ జరుగుతున్న ఎమర్జెన్సీ కాల్స్ రావడంతో ఆ ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. ఆ షూటర్‌ను తరిమే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఓ వెటర్నరీ క్లినిక్‌లోకి ప్రవేశించిన దుండగుడిని చుట్టుముట్టి కాల్చేశారు. నిందిత వ్యక్తిని 45 ఏళ్ల విక్టర్ మాతా విల్లారియల్గా గుర్తించారు. అయితే అతనిపై గతంలో కేసులో ఉన్నాయి. ఓ వెహికల్ ఆఫీసర్‌ను హత మార్చిన కేసులో అతని కోసం గాలిస్తున్నారు. షూటింగ్ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో లాక్డౌన్ ప్రకటించారు. సమీప కమర్షియల్ ప్రాపర్టీలను మూసివేశారు. నిందిత వ్యక్తి కాల్పుల సమయంలో సుమారు 40 రౌండ్లు ఫైరింగ్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
🇺🇸 Mass shooting in Texas: one person killed, nine others injured
A shootout between the police and the suspect lasted for about two hours, after which he was neutralized, local media reports.
No information has been provided about the shooter’s motives.… pic.twitter.com/2Iq4CnpV9u
— RusWar (@ruswar) June 13, 2026