దళిత సర్పంచ్‌పై కాంగ్రెస్ నీచ రాజకీయం
దళిత సర్పంచ్‌పై అధికారులు మరోసారి జులుం ప్రదర్శించారు. ఈ సారి ఏకంగా పోలీసుల సాయంతో.. బుల్డోజర్లతో సర్పంచ్ ఇంటి వద్ద బల ప్రదర్శనకు దిగారు. గ్రామానికి ప్రథమ పౌరుడన్న సోయి మరచి సోమవారం డీఈ చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు.
- మరోసారి సర్పంచ్ ఇంటి ముందు కాంగ్రెస్ నేత బుల్డోజర్ల బల ప్రదర్శన
- తన ఇంటిని తానే కూల్చేసుకున్న సర్పంచ్ కృష్ణ
- మాజీ ఎమ్మెల్యే పట్నం ఆగ్రహం
కోస్గి, నవంబర్ 3 : దళిత సర్పంచ్‌పై అధికారులు మరోసారి జులుం ప్రదర్శించారు. ఈ సారి ఏకంగా పోలీసుల సాయంతో.. బుల్డోజర్లతో సర్పంచ్ ఇంటి వద్ద బల ప్రదర్శనకు దిగారు. గ్రామానికి ప్రథమ పౌరుడన్న సోయి మరచి సోమవారం డీఈ చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్పంచ్ కృష్ణ సూచన మేరకు రెండ్రోజులు కూల్చివేత ప్రయత్నాన్ని విరమించుకుంటామని చెప్పిన అధికారులు.. పంతంతో ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా మరోసారి నారాయణపేట జిల్లా కోస్గి మండలం చెన్నారం సర్పంచ్ ఇంటి వద్ద హల్చల్ చేశారు.
దీంతో ఆగ్రహానికి గురైన సర్పంచ్.. అధికారుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. మరోసారి బుల్డోజర్ సర్పంచ్ ఇంటి వద్దకు వచ్చిందన్న విషయం తెలుసుకొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని సర్పంచ్ కృష్ణకు మద్దతుగా నిలిచారు. రెండ్రోజుల గడువు ఇచ్చినా అధికారులు ఒక్క రోజు గడవక ముందే బుల్డోజర్లతో రావడం ఏందని బీఆర్ఎస్ కోస్గి ఇన్చార్జి వెంకట్ నర్సింహులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. తర్వాత సర్పంచ్ నిబంధనల మేరకు.. అధికారులు సూచించిన వరకు తన ఇంటిని తొలగించుకున్నాడు.
అధికారుల తీరు హేయనీయం : పట్నం
దళిత సర్పంచ్ పట్ల అధికారులు వ్యవహరించిన తీరు హేయనీయమని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం చెన్నారం సర్పంచ్ ఇంటికి చేరుకున్న ఆయన కూల్చేందుకు వచ్చిన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకాలోనే అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధికి సహకరిస్తామని బాధితులు చెప్తున్నా అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఇదెక్కడి ప్రజాపాలన అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇండ్లు కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించాలని, ఒక్కో బాధితుడికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించి.. ఖాళీ స్థలం లేని పేదలకు స్థలం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

