న్యూఢిల్లీ: తనను అమరుడిగా మార్చాలంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ శాస్త్రవేత్తలను ఆదేశించినట్టు ‘డెయిలీ మెయిల్’ ఓ కథనాన్ని ప్రచురించింది. శాస్త్రవేత్తలు ఆ పనిచేసి పెడితే రష్యాను ఎప్పటికీ ఏలేయాలన్నది పుతిన్ కల కావొచ్చు. జీవ గడియారాన్ని వెనక్కి తిప్పడం గురించి ఏం చేశారని జూన్‌లో రష్యా ఆరోగ్య శాఖ వైద్యులు, పరిశోధకులకు లేఖ రాసిన విషయాన్ని డెయిలీ మెయిల్ గుర్తుచేసింది. అయితే అమరత్వాన్ని ప్రసాదించే దివ్యౌషధాన్ని తయారుచేసేందుకు కొన్ని సంవత్సరాలు, బిలియన్ల కొద్దీ ఖర్చవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
2.75 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: స్పామ్ కాల్స్ బెడదను నివారించడానికి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ చేపట్టిన ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటివరకు 50 సంస్థలు, 2.75 లక్షల మొబైల్ నంబర్లను యాక్సెస్ ప్రొవైడర్లు బ్లాక్ లిస్టులో పెట్టాయి. అన్‌రిజిస్టర్డ్ టెలీ మార్కెటర్లపై చర్యలు తీసుకోవాలన్న ట్రాయ్ ఆదేశాల మేరకు టెలికం సంస్థలు ఈ మేరకు చర్యలు చేపట్టాయి.