Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
Cyclone Murasu | బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురాసు’ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఆంధ్రప్రదేశ్ తీరానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నది.
Cyclone Murasu | బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురాసు’ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్ తీరానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించిన తాజా బులెటిన్ ప్రకారం.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తుపాను గత ఆరు గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా కదిలింది. నవంబర్ 2న తెల్లవారుజామున 2.30 గంటలకు 13.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉన్నది.
ప్రస్తుతం చెన్నైకి తూర్పు-ఈశాన్యంగా 260 కిలోమీటర్లు, నెల్లూరుకు ఆగ్నేయంగా 290 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 320 కిలోమీటర్లు, కావలికి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, ఒంగోలుకు ఆగ్నేయంగా 330 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణంగా 470 కిలోమీటర్ల దూరంలో తుపాను ఉన్నదని ఐఎండీ తెలిపింది.
ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం
మురాసు తుపాను వాయవ్య దిశగా కదులుతూ మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అంచనా వేసింది. నవంబర్ 2 అర్ధరాత్రి 11.30 గంటల నుంచి నవంబర్ 3 తెల్లవారుజామున 4 గంటల మధ్య నెల్లూరు-నర్సాపురం మధ్య ఒంగోలుకు సమీపంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నదని వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నది. అప్పుడప్పుడు గాలుల వేగం 120 కిలోమీటర్లకు చేరవచ్చని హెచ్చరించింది.
ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన
తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో నవంబర్ 3, 4 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉండనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 20 మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. వీటిలో ఏలూరు జిల్లాలో తొమ్మిది మండలాలు, కృష్ణా జిల్లాలో ఐదు, ఎన్టీఆర్ జిల్లాలో ఐదు, బాపట్ల జిల్లాలో ఒక మండలం ఉన్నది.
ఏపీకి సీఎం విజయ్ సాయం
మురాసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది, యంత్రాలు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌కు ఫోన్ చేసి సహాయం కోరారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం సిబ్బంది, యంత్రాలను పంపించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి విజయ్ సానుకూలంగా స్పందించినట్టు ఏపీ సీఎంవో వెల్లడించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తుపాను తీరం దాటే సమయంలో బలమైన గాలులు, భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉన్నందున తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలన్నారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు, హోర్డింగులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
Ramayana | రామాయణకు భారీ స్పందన.. ఒక్కరోజులోనే 36 వేలకి పెరిగిన అడ్వాన్స్ బుకింగ్స్!
RTC Bus Fare | కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. నవంబర్ 5 నుంచి కొత్త రేట్లు!
Trump Warning | 10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

