భక్తులు లేకుండానే పూరీ జగన్నాథుడి రథయాత్ర
భక్తులు లేకుండానే పూరీ జగన్నాథుడి రథయాత్ర | ఒడిశా పూరీలో జగన్నాథుడి రథయాత్ర ఈ ఏడాది భక్తులు లేకుండానే జరుగనుంది. రహదారిపై మార్గమధ్యలో ఇండ్ల, హోటళ్ల పైకప్పులపై నుంచి

ఈ నెల 12న పూరీలో కర్ఫ్యూ విధించిన అధికారులు
భువనేశ్వర్ : ఒడిశా పూరీలో జగన్నాథుడి రథయాత్ర ఈ ఏడాది భక్తులు లేకుండానే జరుగనుంది. రహదారిపై మార్గమధ్యలో ఇండ్ల, హోటళ్ల పైకప్పులపై నుంచి యాత్రను వీక్షించేందుకు అనుమతి ఇచ్చింది. అంతకు ముందు ఆచారాలను చూసేందుకు అనుమతించమని చెప్పిన ప్రభుత్వం.. ఆ తర్వాత సడలింపులు ప్రకటించింది. ఈ నెల 12న పూరీ పట్టణంలో జగన్నాథుడి రథయాత్ర జరుగనుండగా.. ఒక రోజు ముందు నుంచే.. యాత్ర మరుసటి రోజు మధ్యాహ్నం వరకు పూరీ పట్టణంలో కర్ఫ్యూ విధించనున్నట్లు అధికారులు తెలిపారు.
కరోనా మహమ్మారి కారణంగా వరుసగా రెండో సంవత్సరం భక్తులు లేకుండానే బలభద్ర, సుభద్ర, జగన్నాథుడి రథయాత్ర పండుగను నిర్వహిస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ సమర్త్ వర్మ తెలిపారు. టీవీల్లో కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయనున్నట్లు తెలిపారు. యాత్ర సందర్భంగా ఎస్పీ కేవీ సింగ్ పూరీ పట్టణంలో మూడు కిలోమీటర్ల పొడవున పర్యటించి రథయాత్ర సన్నాహాలను పరిశీలించారు. రహదారి పొడవున రోడ్లకు ఇరువైపులా 230 నివాస గృహాలు, 41 హోటళ్లు, లాడ్జీలు ఉన్నాయని తెలిపారు. యాత్రను ఆయా భవనాలపై నుంచి వీక్షించొచ్చన్నారు. అయితే, యాత్ర సందర్భంగా రెండు రోజుల ముందు నుంచే హోటళ్లలో బుకింగ్‌లు నిలిపివేయాలని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.
పండుగకు ముందే పూరీకి వచ్చే రోడ్లను మూసివేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో భక్తులెవరూ పూరీకి రావొద్దని కోరారు. అయితే, ఈ సారి రథాలను లాగేందుకు కొవిడ్ నెగెటివ్ సర్వీసర్లను మాత్రమే అనుమతించనున్నట్లు టెంపుల్ అడ్మినిస్ట్రేటర్ క్రిషన్‌కుమార్ తెలిపారు. రథాలను లాగడానికి ఉపయోగించే తాడులను తాకడానికి పోలీసు సిబ్బందిని, అధికారులను అనుమతించరని స్పష్టం చేశారు. రథాలను లాగే సేవలకు శానిటైజర్లు, మాస్క్‌లు, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పొట్టలో గడబిడా?
వర్షాకాలంలో ఈ కాయలు తప్పనిసరిగా తినాలి..! ఎందుకంటే..?
దేశంలో 35కోట్లు దాటిన టీకాల పంపిణీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

