CSK vs SRH : పంతొమ్మిదో సీజన్లో ప్లే ఆఫ్స్ పోరు ఆసక్తి రేపుతున్న వేళ సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. మూడో స్థానంలో కొనసాగుతున్న హైదరాబాద్ సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ను వారి సొంతగడ్డపై ఢీ కొడుతోంది. అటు చెన్నైకి కూడా ఈ మ్యాచ్ చావోరేవో. చెపాక్ వేదికగా జరుగుతున్న పోరులో టాస్ గెలిచిన సీఎస్కే సారథి రుతురాజ్ బ్యౌటింగ్ తీసుకున్నాడు.
ప్రస్తుతం ఏడు విజయాలతో సన్‌రైజర్స్ మూడో స్థానంలో.. ఆరు విజయాలతో చెన్నై ఐదులో కొనసాగుతున్నాయి. ఇరజట్లు రెండు పాయింట్లతో ప్లే ఆఫ్స్ అవకాశాల్ని మెరుగుపరచుకోవాలనే పట్టదలతో ఉన్నాయి. గత రెండేళ్లుగా చెన్నైపై ఆధిపత్యం చెలాయిస్తున్న హైదరాబాద్ మళ్లీ షాకివ్వాలని భావిస్తోంది. ధోనీ ఆడతాడంటూ వైరలైన వార్తలకు గైక్వాడ్ చెక్ పెడుతూ.. ఇంకా ఫిట్‌గా లేడని చెప్పాడు.
🚨 Toss update from Chennai 🚨@ChennaiIPL won the toss and elected to bat first against @Sunrisers
Updates ▶️ https://t.co/4SxAzYKEvY#TATAIPL | #KhelBindaas | #CSKvSRH pic.twitter.com/u4gjxRo6HK
— IndianPremierLeague (@IPL) May 18, 2026
సన్‌రైజర్స్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరన్ రవిచంద్రన్, నితీశ్ రెడ్డి, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), శివాంగ్ కుమార్, ఇషాన్ మలింగ, షకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే.
ఇంప్యాక్ట్ సబ్స్ – ముకేశ్ చౌదరీ, మాథ్యూ షార్ట్, సర్ఫరాజ్, అమన్ ఖాన్, గుర్జప్నీత్ సింగ్.
చెన్నై తుది జట్టు : సంజూ శాంసన్(వికెట్ కీపీర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, బ్రెవిస్, దూబే, ప్రశాంత్ వీర్, అకీల్ హొసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కంభోజ్, స్పెన్సర్ జాన్సన్.
ఇంప్యాక్ట్ సబ్స్ – ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ, లివింగ్ స్టోన్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్.