బెంగళూరు: కర్ణాటక యువజన కాంగ్రెస్‌లో వర్గ పోరు బయటపడింది. కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో రెండు వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఒకరినొకరు దూషించుకున్నారు. చొక్కా కాలర్లు పట్టుకోవడంతో పాటు కొట్టుకునే వరకు పరిస్థితి దిగజారింది. (Youth Congress Leaders Clash) కర్ణాటక రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హెచ్ఎస్ మంజునాథ్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు హెచ్ఆర్ దీపికారెడ్డి మద్దతుదారుల మధ్య ఈ ఘర్షణ చెలరేగింది. అప్పగించిన విధులు నిర్వర్తించడంలో విఫలమయ్యారనే ఆరోపణలపై దీపికారెడ్డితో పాటు కొందరు కార్యవర్గ సభ్యుల పదవులను రాష్ట్ర నాయకత్వం ఇటీవల నిలిపివేసింది.
కాగా, సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో తనపై వచ్చిన ఆరోపణలను దీపికా రెడ్డి తీవ్రంగా ఖండించారు. తనను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని, వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. పార్టీ తీసుకున్న చర్యను దీపికారెడ్డి, ఆమె మద్దతుదారులు ప్రశ్నించడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో కార్యాలయ ప్రాంగణంలోనే ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరినొకరు దూషించుకోవడంతో చొక్కా కాలర్లు పట్టుకుని కొట్టుకునేందుకు ప్రయత్నించారు.
మరోవైపు ఈ సంఘటన తర్వాత దీపికా రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హెచ్ఎస్ మంజునాథ్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత కక్ష, రాజకీయ అభద్రతాభావం కారణంగా తన పదవిని, బాధ్యతలను అక్రమంగా నిలిపివేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
అయితే కర్ణాటక యూత్ కాంగ్రెస్‌లో వర్గ పోరు ఆరోపణలను మంజునాథ్ గౌడ తోసిపుచ్చారు. చిన్న బేదాభిప్రాయం వల్ల వాగ్వాదం జరిగినట్లు తెలిపారు. పదవుల నుంచి వారిని సస్పెండ్ చేయలేదని చెప్పారు. వారికి అప్పగించిన పనిని పూర్తి చేయనందున వారి పదవులను కేవలం నిలిపివేశామని ఆయన అన్నారు. చర్చ సందర్భంగా కొంత గందరగోళం నెలకొనడంతో యువకుల మధ్య తోపులాట జరిగిందని, పెద్ద గొడవ కాదని వివరించారు.
అలాగే సమావేశంలో అనుచితంగా ప్రవర్తించిన వారి ఫుటేజీని రికార్డ్ చేసినట్లు మంజునాథ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పీసీసీ నాయకత్వం, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సమర్పిస్తామని ఆయన చెప్పారు. కాగా, యూత్ కాంగ్రెస్ నేతల ఘర్షణకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Clash erupts between two groups of Youth Congress in Bengaluru. pic.twitter.com/RPmR7Cg2ED
— News Arena India (@NewsArenaIndia) May 18, 2026
Chaos erupted at the Karnataka Pradesh Congress Committee (KPCC) office in Bengaluru after a violent clash broke out between members of the Youth Congress during a meeting held to discuss protests over the alleged NEET question paper leak.
According to sources, tensions had been… pic.twitter.com/Yy3WKwf1cg
— Hate Detector 🔍 (@HateDetectors) May 18, 2026