New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
New Districts | పాలన సౌలభ్యం కోసం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టమని బీఆర్ఎస్ జిల్లా నాయకులు అన్నారు.
నాగర్ కర్నూల్ : పాలన సౌలభ్యం కోసం కేసీఆర్ ( KCR ) తీసుకున్న నిర్ణయాల్లో కొత్త జిల్లాల (New Districts ) ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టమని బీఆర్ఎస్ ( BRS ) జిల్లా నాయకులు అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఆదివారం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
గతంలో జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని, దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చేదని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయాలనే సంకల్పంతో నూతన జిల్లాల ఏర్పాటుకు కేసీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు.
నాగర్ కర్నూల్ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం బలమైన పునాది వేసిందని అన్నారు. జిల్లా ఏర్పాటులో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కృషి ఎంతగానో ఉందని వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

