కరువు జిల్లాగా ప్రకటించాలి
కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని, నిత్యావసరాల వస్తువుల బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించాలని కోరుతూ.. శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించా రు.
- కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా
కరీంనగర్ తెలంగాణచౌక్, నవంబర్ 7: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని, నిత్యావసరాల వస్తువుల బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించాలని కోరుతూ.. శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించా రు. సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ.. వర్షాభావ ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు ఎకరాన రూ.50వేలు, ఇతర పంటలకు రూ.30వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి, నిత్యావసరాల ధరలను నియంత్రించాలని కోరారు.
కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించి, రాష్ర్టానికి రూ.50 వేల కోట్ల నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి బండి సంజ య్ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు. 16 మండలాల్లో కరువు నెలకొంటే ప్రభుత్వం కేవలం మూడే కరువు మండలాలు ప్రకటించడం అర్థరహితమని మండిపడ్డారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి శాస్త్రీయంగా అంచనాలను రూపొందించాలని సూచించారు. మంత్రులు కరువు నివారణపై సమీక్షించినా ప్రణాళికలు అమలు చేయడలో విఫలమయ్యారని అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

