తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలి
అర్నబ్, మురసు వరుస తుఫాన్ల కారణంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వరి, మిర్చి, పత్తి, ఉద్యాన పంటలు కో ల్పోయి అన్నదాతలు పుట్టెడు దుఃఖంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే సమగ్ర సర్వే చేయించి నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.
- ఉమ్మడి ఖమ్మంలో వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
- రైతులకు పరిహారం అందించాలి
- ఎంపీ వద్దిరాజు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్
ఖమ్మం, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అర్నబ్, మురసు వరుస తుఫాన్ల కారణంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వరి, మిర్చి, పత్తి, ఉద్యాన పంటలు కో ల్పోయి అన్నదాతలు పుట్టెడు దుఃఖంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే సమగ్ర సర్వే చేయించి నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సత్తుపల్లి మాజీ ఎమ్మె ల్యే సండ్ర వెంకటవీర య్య, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఉమ్మడి జిల్లాకు చేసిన మేలేమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మంత్రులు భట్టి విక్రమార, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేద ని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. తుఫాన్ వల్ల 32 వేల ఎకరాలపైగా నష్టం జరిగిందని, వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లింగాల కమల్రాజు మాట్లాడుతూ.. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

