మరోవారం లాక్డౌన్ పొడగింపు.. ఎక్కడంటే?
మరోవారం లాక్డౌన్ పొడగింపు.. ఎక్కడంటే? | హర్యానా ప్రభుత్వం కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ను మరోవారం పొడగించింది. ఈ సందర్భంగా పలు సడలింపులు ప్రకటించింది.

చండీగఢ్ : హర్యానా ప్రభుత్వం కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ను మరోవారం పొడగించింది. ఈ సందర్భంగా పలు సడలింపులు ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్ని దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. హోటళ్లు, మాల్స్, రెస్టారెంట్లు, బార్లు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు తెరవొచ్చని పేర్కొంది. 50 శాతం సామర్థ్యంతో జిమ్‌లు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. స్పాలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్టేడియాల్లో క్రీడా కార్యకలాపాల కోసం అనుమతి ఇవ్వగా.. వీక్షకుల ప్రవేశంపై నిషేధం విధించారు.
కొవిడ్ పాజిటివిటీ రేటు, కొత్త కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నా ముందు జాగ్రత్త చర్యలు కొనసాగించేందుకు ‘మహమ్మారి హెచ్చరిక.. సురక్షిత్ హర్యానా’ కోసం లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అన్ని కళాశాలలు, కోచించ్ సంస్థలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు, గ్రంథాలయాలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసే ఉంటాయని పేర్కొంది. గత నెలలో 15వేల మార్క్‌ను దాటిన హర్యానాలో కరోనా కేసులు ప్రస్తుతం 500కు పడిపోయాయి. మరణాలు సైతం భారీగా తగ్గుముఖం పట్టాయి. కరోనా విజృంభణతో హర్యానా ప్రభుత్వం మే 3న రాష్ట్రంలో లాక్డౌన్ విధించించగా.. ఆరుసార్లు పొడగించింది.
ఇవి కూడా చదవండి..
ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ కార్డు.. ఇలా అప్లై చేయండి
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి
Alert : తెలంగాణకు నాలుగు రోజుల వర్ష సూచన
నేటి నుంచి పట్టాలెక్కనున్న ప్రత్యేక ట్రైన్లు
దేశ రాజధానిలో అందుబాటులోకి రష్యా టీకా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

