న్యాయమూర్తుల కొవిడ్ సంరక్షణ కేంద్రంగా ఫైవ్‌స్టార్ హోటల్
కొవిడ్ సంరక్షణ కేంద్రంగా ఫైవ్‌స్టార్ హోటల్ | దేశ రాజధానిలో కరోనా బారినపడ్డ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, జ్యుడీషియల్ ఆఫీసర్లు వారి కుటుంబాల కోసం కొవిడ్-19 సంరక్షణ కేంద్రంగా ఫైవ్‌స్టార్ హోటల్‌ను ఎంపిక చేశారు.

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా బారినపడ్డ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, జ్యుడీషియల్ ఆఫీసర్లు వారి కుటుంబాల కోసం కొవిడ్-19 సంరక్షణ కేంద్రంగా ఫైవ్‌స్టార్ హోటల్‌ను ఎంపిక చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని అశోక హోటల్లో వంద గదులను బుక్ చేసినట్లు చాణక్యపురి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గీతా గ్రోవర్ ఉత్తర్వుల్లో తెలిపారు. ఇందులో ప్రిమస్ హాస్పిటల్ కొవిడ్ కేర్ సేవలను అందుస్తుందని పేర్కొన్నారు. బయోమెడికల్ వ్యర్థాలు పారవేయడం దవాఖాన బాధ్యతేనని, హోటల్ సిబ్బందికి అన్ని రక్షణ సామగ్రి అందించడంతో పాటు తగిన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. గదులు, హౌస్ కీపింగ్, రోగులకు ఆహారం పంపిణీ సేవలను హోటల్ నిర్వాహకులు అందజేస్తారని డీఎం పేర్కొన్నారు. ఆసుపత్రి హోటల్‌కు డబ్బులు చెల్లిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఢిల్లీలో పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో హాస్పిటళ్లలో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో సోమవారం 380 మరణాలు నమోదయ్యాయి. అలాగే 20వేలకుపైగా తాజాగా కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి..
కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి
భారత్‌కు మే 1న ‘స్పుత్నిక్-వీ’ మొదటి బ్యాచ్ : ఆర్డీఐఎఫ్
కాస్త తగ్గినయ్.. కొత్తగా 3.23లక్షల కరోనా కేసులు, 2,771 మరణాలు
రేపటి నుంచి కాళేశ్వరంలో దర్శనాలు బంద్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

