సిటీబ్యూరో, జనవరి 12(నమస్తే తెలంగాణ): యువ హీరో ఆది సినిమాకు కాస్ట్యూమ్స్ డిజైనింగ్‌కు అవకాశం కల్పిస్తామని ఓ యువ ఫ్యాషన్ డిజైనర్‌ను మోసం చేశారు. మణికొండకు చెందిన బాధితురాలు ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తిచేసింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి తాను యువ హీరో ఆది బాల్య స్నేహితులమంటూ.. త్వరలో ఓ కొత్త సినిమా చేయబోతున్నాడని.. అందులో కాస్ట్యూమ్స్ డిజైనింగ్ అవకాశం ఇప్పిస్తానని ఆశపెట్టాడు. ఓ దర్శకుడితో ఫోన్లో మాట్లాడించాడు. దర్శకుడి మనిషిని పంపిస్తున్నానంటూ.. డబ్బులు అతడికి ఇవ్వమని చెప్పాడు. ఫిలింనగర్ దగ్గర ఓ గుర్తు తెలియని వ్యక్తి యువతి నుంచి డబ్బులు తీసుకొని వెళ్లాడు. మరోసారి రూ. 5 లక్షలు చెల్లించాలని అనడంతో ఖాతాలో జమ చేసింది. అగ్రిమెంట్ కాకపోవడంతో అతడిని నిలదీసింది. ఆ తర్వాత అతడు చీటర్ అని తెలియడంతో వెంటనే ఫోన్ చేయగా, వీడియో కాల్లో తీవ్రంగా బెదిరించాడు. బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు.