న్యూఢిల్లీ, అక్టోబర్ 30: కరోనా మూలాలను తాము ఎప్పటికీ కనిపెట్టలేకపోవచ్చని అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ కార్యాల యం (ఓడీఎన్ఐ) తెలిపింది. జీవాయుధంగా కరోనాను సృష్టిం చి ఉండకపోవచ్చని తాజా నివేదికలో అభిప్రాయపడింది. వైరస్ జంతువుల నుంచి మనిషికి సోకిందనడం, ల్యాబ్ నుంచి లీక్ అయిందనడం- ఈ రెండు వాదనలూ సరైనవిగా తోచేవని వ్యాఖ్యానించింది.