సహకార బ్యాంకులను బలోపేతం చేసుకోవాలి : వినోద్‌కుమార్
సహకార బ్యాంకులను బలోపేతం చేసుకోవాలి : వినోద్‌కుమార్ | ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో జాతీయ బ్యాంకుల పరిస్థితులు అగమ్యగోచరంగా, విషమంగా మారనున్నాయని.. ఈ నేపథ్యంలో సహకార బ్యాంకులను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో జాతీయ బ్యాంకుల పరిస్థితులు అగమ్యగోచరంగా, విషమంగా మారనున్నాయని.. ఈ నేపథ్యంలో సహకార బ్యాంకులను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. సహకార సంఘాల విభాగంలో జాతీయ స్థాయిలో ఉత్తమ బ్యాంకుగా టెస్కాబ్, జిల్లాల విభాగంలో కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకు ఎంపికవడంపై వినోద్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా టెస్కాబ్ చైర్మన్, కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ కూడా అయిన కొండూరి రవీందర్రావును ఆయన మంగళవారం మంత్రుల నివాసంలో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం కానున్నాయని, అందులో భాగంగానే జాతీయ బ్యాంకుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, రైతులు సహకార బ్యాంకులను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సహకార బ్యాంకుల వ్యవస్థ బలోపేతం ద్వారానే ప్రజలు, రైతుల మనుగడ ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లాల వారీగా ఉన్న సహకార బ్యాంకులన్నింటినీ కలిపి రాష్ట్రస్థాయిలో ఏకైక సహకార బ్యాంకును ఆవిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం ఉన్న మూడంచెల విధానం బదులు రెండంచెల విధానాన్ని అమలు చేయాలని ఆయన తన అభిమతాన్ని వ్యక్తం చేశారు.
రానున్న రోజుల్లో రుణాలను ఇచ్చే పరిస్థితి జాతీయ బ్యాంకులకు ఉండకపోవచ్చన్నారు. రానున్న రోజుల్లో సహకార బ్యాంకులదే భవిష్యత్తు అని ఆయన అన్నారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు మాట్లాడుతూ సమష్టి కృషితో ఈ విజయాన్ని సాధించామని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
కట్టిపడేసే చూపులు.. కిర్రెక్కించే పోజులు.. బ్లూ శారీలో ప్రణవి మనుకొండ హాట్ ఫొటోలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

