Coolie | సూపర్ స్టార్ రజనీకాంత్ గతంలో మాదిరిగా హిట్స్ అందుకోలేకపోతున్నాడు. పుష్కర కాలం తర్వాత జైలర్‌తో మాస్ కంబ్యాక్ ఇచ్చాడు . ఈ హిట్‌తో ఫ్యాన్స్ పాత ఫ్లాపు సినిమాల సంగతి మరిచిపోయారు. విక్రమ్, పొన్నియన్ సెల్వన్ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను పదిరోజల్లోనే దాటేశాడు. ఇక చివరిగా జై భీమ్ దర్శకుడు జ్ఞానావేల్ రాజాతో చేసిన వేట్టాయాన్ సినిమా చేశాడు. ఈ చిత్రం కమర్షియల్ ఫేయిల్యూర్‌గా మిగిలింది. ప్రస్తుతం లోకేష్ కనగారాజ్తో కూలీ సినిమా కూడా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ ఆడియెన్స్‌లో భారీ అంచనాలు పెంచాయి.
తమిళంలో మాత్రమే కాదు.. తెలుగులోనూ ఈ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష్స్ మాములుగా లేవు. నాగార్జున కీ రోల్ చేస్తుండటం.. దట్ టూ, నెగెటీవ్ రోల్ చేస్తుండడంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.అయితే కూలీ చిత్రాన్ని 100 రోజులలో అంటే ఆగస్ట్ 14న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదల చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంది. శృతి హాసన్, ఉపేంద్ర చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో రజనీకాంత్ బడా హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు.
కూలీ` సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో నిర్మాతలు భారీగా డిమాండ్ చేస్తున్నారు. తెలుగులో దాదాపు 55 కోట్ల వరకు అడుగుతున్నారని సమాచారం.. రజినీకాంత్ 171వ చిత్రంగా ‘కూలి’ రూపుదిద్దుకుంటోంది. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి చిత్రాల తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన చిత్రమిది. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ గ్రాండ్ స్కేల్లో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈచిత్రం ఎప్పుడు విడుదలవుతుందా? అని రజినీకాంత్ ఫ్యాన్స్ తో పాటు ఇండియన్ ఆడియెన్స్ తెగ ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఆగస్ట్ 14న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అదే రోజు హృతిక్, ఎన్టీఆర్ నటించిన వార్ 2 కూడా విడుదల కానుంది.
Arangam Adhirattume, Whistle Parakkattume!🔥💥 #CoolieIn100Days ⏳#Coolie worldwide from August 14th 😎@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @ArtSathees… pic.twitter.com/M8tqGkNIrJ
— Sun Pictures (@sunpictures) May 6, 2025