Coolie | సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘కూలీ’, భారీ అంచనాలతో ఆగస్టు 14న విడుదలైంది. కళానిధి మారన్ సన్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీ, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను తెచ్చుకుంది. తాజాగా మూవీ నుండి ‘చికిటు’ (Chikitu) అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేయగా, ఇది ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. తెలుగులో శ్రీనివాస మౌళి ఈ పాటను రాయగా.. టి. రాజేందర్, అనిరుధ్, అరివు ఆలపించారు. ఇందులో రజినీకాంత్ తనదైన స్టైల్లో డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
కూలీ చిత్రంలో అక్కినేని నాగార్జున సైమన్ అనే స్టైలిష్ విలన్ పాత్రలో నటించారు. అలాగే ఉపేంద్ర.. కాళేశ్ పాత్రలో, సౌబిన్ షాహిర్.. దయాల్ పాత్రలో, సత్యరాజ్, ఆమిర్ ఖాన్, పూజా హెగ్డే, శృతి హాసన్ వంటి నటీ నటులు కీలక పాత్రలలో కనిపించి సందడి చేశారు.. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇందులో రజినీకాంత్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకి మాత్రం బాగా నచ్చేసింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సినిమాని పైకి లేపడంలో చాలా కృషి చేశాడు. అయితే మూవీకి సంబంధించి కథ, స్క్రీన్ ప్లే బలహీనంగా ఉన్నాయని, కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా ఉన్నాయని విమర్శలు కూడా వచ్చాయి.
ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది. విడుదలైన 21 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.511.5 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. భారతదేశంలో రూ.334.7 కోట్ల గ్రాస్, ఓవర్సీస్లో రూ.176.8 కోట్లు వసూలు చేసినట్లు ఇన్సైడ్ టాక్. చిత్రంలో రజనీకాంత్, నాగార్జున వంటి స్టార్స్ నటించిన క్రమంలో ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగింది. ఈ చిత్రం కథ మాజీ కూలీ యూనియన్ లీడర్ అయిన దేవా చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో కొన్ని సీన్స్‌ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు.