చాలా అరుదుగానైనాసరే కొంతమందికి ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు చేతికి అందుతుంది. బోనస్, ఇన్వెస్ట్మెంట్, ఆస్తి అమ్మకం, వారసత్వ పంపకాలు ఇలా అనేక కారణాలతో లక్షలు వచ్చిపడతాయి. ఆ మొత్తాన్ని ఎలా వాడుకోవాలనే సందేహాలు రావడం సహజం. మరి ఆ సొమ్ముతో ఏ చేయాలో తెలుసా..
రుణాల చెల్లింపులు: క్రెడిట్ కార్డు బకాయిలతోపాటు వ్యక్తిగత, వాహన రుణాలు అధిక వడ్డీతో కూడుకున్నవి. ముఖ్యంగా క్రెడిట్ కార్డుకు సంబంధించిన చెల్లింపులను తీర్చేయండి. తద్వారా 45 శాతం వార్షిక వడ్డీ భారాన్ని దించుకోవచ్చు. అలాగే అధిక వడ్డీతో ఉన్న గృహ రుణాలనూ తీర్చేయవచ్చు.
ఎమర్జెన్సీ ఫండ్:ఇప్పటిదాకా ఎమర్జెన్సీ ఫండ్ అంటూ లేకపోతే వెంటనే కనీసం నాలుగు లక్షలైనా దానికి కేటాయించండి. అధిక లిక్విడిటీ, అసలుకు గ్యారంటీ ఉండే లిక్విడ్ ఫండ్లలో మదుపు చేయండి. అలాగే కొంత రిటైర్మెంట్ ఫండ్ కోసం మల్టీ అసెట్ ఫండ్లు, రిస్క్ తక్కువగా ఉండే ఆర్బిట్రేజ్ ఫండ్లు, విదేశాల్లో మదుపు చేసే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిగా పెట్టండి. ఇప్పటిదాకా చేస్తున్న ఎస్ఐపీలకుతోడు మరింత మొత్తాన్ని మదుపు చేయండి.