నోయిడా: కారు డాక్యుమెంట్లు చూపించమని అడిగిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కిడ్నాప్ చేశాడు ఓ వ్యక్తి. కారులోకి రండి.. మొబైల్ ఫోన్లో ఉన్న డాక్యుమెంట్ల సాఫ్ట్ కాపీలను చూపిస్తానని చెప్పి ఆ కానిస్టేబుల్‌ను బలవంతంగా 10 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లిపోయాడు. చివరకు ఓ పోలీస్ పోస్టు వద్ద దింపి పారిపోయాడు. యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు సచిన్ రావల్‌ను పోలీసులు గాలించి పట్టుకున్నారు. అతను రెండేండ్ల కింద హర్యానాలో షోరూమ్ నుంచి టెస్ట్ డ్రైవింగ్ పేరుతో కారుతో పరారయ్యాడు. దొంగిలించిన కారుకి తన గ్రామంలోని మరో కారు నంబరునే తగిలించి ఇన్నాళ్లూ దర్జాగా తిరిగాడు.