సర్వోత్తంకు సహాయ నిరాకరణ!
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల పర్వంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలోనే చేతులెత్తేసిందా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోనూ ఎవరికివారే యమునాతీరే అన్న చందంగా మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తుండటంతో అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి తీవ్ర ఇరకాటంలో పడిపోయారు.
- ఇరకాటంలో కాంగ్రెస్ అభ్యర్థి
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల పర్వంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలోనే చేతులెత్తేసిందా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోనూ ఎవరికివారే యమునాతీరే అన్న చందంగా మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తుండటంతో అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి తీవ్ర ఇరకాటంలో పడిపోయారు. సొంత జిల్లా నల్లగొండలో అభ్యర్థి ప్రకటన నాటి నుంచి అడుగడుగునా సహాయ నిరాకరణే ఎదురవుతున్నది. నేటికీ ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు సైతం పట్టించుకోకపోవడంతో కక్కలేక మింగలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తంరెడ్డికి సహకారం లేకుండా పోయింది.
జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు కనీస సమాచారం లేకుండానే సీఎం రేవంత్‌రెడ్డి అధిష్టానంతో సర్వోత్తంరెడ్డిని అభ్యర్థిగా ప్రకటన చేయించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బాహాటంగానే అసంతృప్తిని వెళ్లగక్కారు. ఆయనను సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలోకి నిలుపాలని ఉత్తమ్ ఆశించారు. సొంత జిల్లాలో తన అనుచరుడిగా ఉన్న సర్వోత్తంరెడ్డిని తనకు తెలువకుండానే అభ్యర్థిగా ప్రకటించడం ఏందని ఉత్తమ్ గుర్రుగా ఉన్నారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటి వాళ్ల అభిప్రాయాలు తీసుకోకుండానే ఎక్కడి ఎమ్మెల్యేలను అక్కడే సొంత నియోజకవర్గాలకు ఇన్చార్జులుగా నియమించారు. ఇది మరింత వివాదానికి దారితీసింది.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని హుజూర్‌నగర్‌కు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని నల్లగొండ నియోజకవర్గానికే పరిమతం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఓ వైపు ఓట్ల నమోదులో బీఆర్ఎస్ దూసుకుపోతుండగా కాంగ్రెస్ నేటికీ అడుగు ముందుకు వేయలేకపోతున్నది. ఈ నెల 10 నాటికే ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం పెట్టాలని పీసీసీ ఆదేశించినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఈ విషయంలో కొంత చొరవ చూపే యత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. సీఎం, పీసీసీ ఆదేశాలతో ఈ నెల 21న నల్లగొండలో ఉమ్మడి జిల్లా మీటింగ్ పెట్టాలని నిర్ణయించగా దీనికి సైతం మంత్రులు విముఖత చూపడంతో అది కాస్తా వాయిదా పడింది. సర్వోత్తంరెడ్డికి వాస్తవంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని లేకున్నా ముందస్తు సమచారం లేకుండానే అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీ ప్రకటించాక వెనక్కి తగ్గితే బాగుండదని రంగంలోకి దిగారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

