Enugula Rakesh Reddy | యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ : ఏనుగుల రాకేష్‌రెడ్డి
Enugula Rakesh Reddy |యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి అన్నారు.
హనుమకొండ చౌరస్తా : యూత్ డిక్లరేషన్ ( Youth Declaration) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం ( Congress cheat) చేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి (Enugula Rakesh Reddy ) అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో శుక్రవారం పర్యటించిన ఆయన విద్యార్థులు, నిరుద్యోగ యువతతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని తీవ్రంగా విమర్శించారు.
ఎన్నికల ముందు యువతే లక్ష్యంగా యూత్ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే యువతను పూర్తిగా విస్మరించడం దురదృష్టకరమన్నారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, నెలకు 4,000 నిరుద్యోగ భృతి అంటూ హామీలు ఇచ్చి యువత ఓట్లను పొందిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆ హామీల అమలుపై ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో గ్యారంటీ కార్డులు ఇచ్చి యువత భవిష్యత్తుపై ఆశలు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా రెండు లక్షల ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ కేయు అధ్యక్షులు బైరపాక ప్రశాంత్, ఇంచార్జి జెట్టి రాజేందర్, పార్టీ సీనియర్ నాయకులు కత్తెరపల్లి దామోదర్, బొల్లికొండ వీరేందర్, అర్బన్, రూరల్ జిల్లా కోఆర్డినేటర్లు అరూరి రంజిత్, లంక రాజగోపాల్, యూనివర్సిటీ నాయకులు కలకోట్ల సుమన్, కందికొండ తిరుపతి, పిన్నింటి విజయ్‌కుమార్, పస్తం అనిల్, జాడి రవి, రాజశేఖర్, ఇస్మాయిల్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Enugula Rakesh Reddy | యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ : ఏనుగుల రాకేష్‌రెడ్డి
Road Accident | ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
Protein Idly | ఇడ్లీలను ప్రోటీన్లు ఉండేలా ఆరోగ్యకరంగా ఇలా తయారు చేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటాయి..
Promotions | టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్లో 63 మంది సిబ్బందికి పదోన్నతులు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

