V Srinivas Goud | స్వాతంత్రం వచ్చిన తరువాత మెజారిటీ వర్గాలకు న్యాయం జరుగడం లేదు.. రాజకీయంగా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అణిచివేయబడ్డారు.. వాళ్ల ఓట్లతో అధికారంలోకి వచ్చి వాళ్ల కోసం ఏం చేయడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. ఎంత జనాభా ఉంటె అంత రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ చెప్పి నోరుమెదపడం లేదని.. సెన్సస్ లో బీసీ జన గణన చేస్తామని బీజేపీ ఆచరించడం లేదన్నారు.
భారత దేశంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే మెజారిటీ వర్గాలను అక్కున చేర్చుకోవాలి. తమిళనాడు, పంజాబ్, కర్ణాటక, తెలంగాణాలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు రాష్టాల్లో ఇచ్చారు.. న్యాయపరంగా ఇబ్బందులు వస్తున్నాయి.. రాజ్యాంగ బద్దంగా లేదని కోర్టులు కొట్టేస్తున్నాయి. సెన్సెస్ లో లేనప్పుడు ఇంత పెర్సెంటేజి అని రిజర్వేషన్లు ఎలా ఇస్తారని న్యాయస్థానాలు అడుగుతున్నాయి. రాజ్యాంగ సవరణ చేయాలి.. సెన్సస్ లో బీసీ గణన చేయాన్నారు శ్రీనివాస్‌గౌడ్ .
కాంగ్రెస్ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తారా…? పార్లమెంట్ స్థంభింపజేస్తారా..? ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రతి కులానికి ఒక నంబరింగ్ ఇచ్చి ఎంత మంది ఉన్నారో గణన చేయించాలన్నారు. ప్రతీ కులానికి ఒక నంబరింగ్ ఇవ్వకుండా న్యాయం ఎలా చేస్తారు. సర్వేతో ఒక్క రూపాయి ఖర్చు కాదు.. హౌస్ హోల్డ్ సెర్వేలో ఎక్కడా కుల గణన ప్రస్తావన లేదు.. కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, లడక్, ఉత్తరాఖండ్‌లో గణన వచ్చే నెల ప్రారంభమతుంది. ఈ రోజు వరకు కూడా బీసీ ఎన్ని కులాలు ఉన్నాయ్.. ఏ కులానికి ఏ నెంబర్ ఇచ్చారో లేదు.. ఎవరి చెవిలో పూలు పెడదాం అనుకున్నారు.. ప్రతిపక్ష పార్టీ మాట్లాడటం లేదు.. అధికార పార్టీ అసలు పట్టించుకోవడం లేదు.. వీళ్ల సంఖ్య తెలిస్తే పునాదులు కదులుతాయని భయపడుతున్నారా..? అని శ్రీనివాస్‌గౌడ్ అడిగారు.
బ్యాంకులను ఎగ్గొటిన వారిలో బీసీలు లేరు.. మోసం చేసిన వారిలో కూడా బీసీలు లేరు.. గణన వాయిదా వేసి ఎస్సి, ఎస్టీ ల తరహా కులాలకు నంబరింగ్ ఇవ్వాలి. ఒక్కో రాష్టంలో ఒక్కో కులాన్ని ఒక్కో విధంగా పిలుస్తారు.. దానిపై పరిశీలన చేసి జాబితా తయారు చేసి.. నంబరింగ్ ఇవ్వాలన్నారు. రూ.80 కోట్ల జనాభా ఉన్న ఓబీసీలకు చట్ట సభల్లో జనాభాకు అనుగుణంగా లేరు.. చట్టాలు తయారు చేసే వద్ద కూడా మెజారిటీకు తగినట్టు ఉన్నప్పుడే న్యాయం జరుగుతుంది. గణన వాయిదా వేసి బీసీ కులాలకు నంబరింగ్ ఇవ్వకుంటే ఓబీసీలు బీజేపీని క్షమించరని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. చట్ట సభల్లో రిజర్వేషన్లు ఇవ్వండి.. సెన్సస్ లో బీసీ గణన చేయండి. మేమే చట్టాలు తయారు చేసుకుంటాము.. జోలె పట్టుకొని ఎవరిని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు.
ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే యువత పోరాటం చేసినట్టు ఓబీసీ ఆందోళన బాట పడుతారు. రాహుల్ గాంధీ మాటలకు పరిమితం కాకుండా ఓబీసీలకు మద్దతుగా పోరాటం చేయాలి.. పార్టీలకు ఐక్యంగా ఓబీసీలు మీ పోరాటానికి అండగా ఉంటామన్నారు. ప్రధానమంత్రి ఓబీసీ రిజర్వేషన్లు చేస్తే చరిత్రలో నిలిచిపోతారు. విద్య..ఉపాధి..రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. లేదంటే ప్రజల ఆగ్రహానికి గురవుతారన్నారు. మాట తప్పితే అన్ని వర్గాలతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు.
ఇతర రాష్టాల్లో రిజర్వేషన్లు కొట్టేసిన విషయం తెలిసి కూడా తెలంగాణలో చట్ట బద్దంగా ముందుకు వెళ్లలేదు.. కేంద్రంపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారు.. న్యాయపరంగా చిక్కులు లేని అంశాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి చిత్త శుద్ధి నిరూపించుకోవాలన్నారు. రిజర్వేషన్ల కల్పనపై కూడా చట్టబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు శ్రీనివాస్‌గౌడ్ .
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పి విల్సన్, ప్రొఫెసర్ సూరజ్ మండల్, మాజీ ఐఎస్ఐ అధికారి, తెలంగాణ ఇంటలెక్టువల్స్ ఫోరమ్ కన్వీనర్ చిరంజీవులు, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, డా. అనిల్ జైహింద్, ప్రొఫెసర్ రతన్ లాల్, బిసి పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షుడు బాలగోని బాల్ రాజు గౌడ్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్, దుర్గయ్య గౌడ్, హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాజేష్ దత్తా తదితరులు పాల్గొన్నారన్నారు.


Switzerland | స్విట్జర్లాండ్ రేవ్ పార్టీలో కాల్పులు.. ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు
వైభవంగా మార్వాడీల కావడి యాత్ర.. హరిహర మహాదేవ’ నామస్మరణతో సాగిన భక్తుల పాదయాత్ర
TVK vs Cong | కాబోయే ప్రధాని విజయ్ అంటూ జోరుగా ప్రచారం.. అధికార కూటిమిలో కలకలం..!