Congress-Twitter : కాంగ్రెస్‌కు ట్విట్టర్ షాక్.. మరో ఐదుగురు నేతల అకౌంట్లు లాక్!
Congress-Twitter : కాంగ్రెస్‌కు ట్విట్టర్ షాక్.. మరో ఐదుగురు నేతల అకౌంట్లు లాక్! | కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆ పార్టీ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఖాతాను లాక్ చేసిన ట్విట్టర్ తాజాగా.. మరో ఐదుగురు నేతలకు చెందిన అకౌంట్లను నిలిపివేసింది. ఈ విషయాన్ని

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆ పార్టీ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఖాతాను లాక్ చేసిన ట్విట్టర్ తాజాగా.. మరో ఐదుగురు నేతలకు చెందిన అకౌంట్లను నిలిపివేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత ప్రణవ్ ఝా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇందులో పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అజయ్ మాకెన్, లోక్‌సభలో ఆ పార్టీ విప్ మాణిక్కం ఠాగూర్, అసోం ఇన్చార్జి, మాజీ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితాదేవ్ ఖాతాలు లాక్ అయ్యాయని పార్టీ సమాచార విభాగం ఇన్చార్జి తెలిపారు.
అయితే, ఈ జాబితా మరింత పెరగొచ్చని పేర్కొన్నారు. పార్టీ నేతల ట్విట్టర్ ఖాతాలను నిలిపివేయడంపై కాంగ్రెస్ మండిపడుతోంది. నిరసన తెలపడాన్ని, ప్రతి ఒక్కరి కోసం పోరాటం చేయడాన్ని తప్పుగా చూస్తున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం తాము చేసే పోరాటాన్ని ఇలాంటి చర్యల ద్వారా ఆపొచ్చని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారని విమర్శించింది. కాగా, ఢిల్లీలో దళిత బాలిక హత్యాచారం కేసులో.. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలు బయటకు తెలిసేలా ట్వీట్ చేశారని, ఈ మేరకు రాహుల్ ఖాతాను లాక్ చేస్తున్నట్లు ట్విట్టర్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
GSLV-F10 : జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలం
Helicopter Crashes : రష్యాలో కుప్పకూలిన పర్యాటకుల హెలికాప్టర్..
నాగార్జున సాగర్‌కు భారీగా తగ్గిన ఇన్‌ఫ్లో
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lungs | ఢిల్లీలో యువత ఊపిరితిత్తులపైనా నల్లని మచ్చలు.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Matt Henry: తొలి ఓవర్లోనే షాకిచ్చిన మ్యాట్ హెన్రీ.. రోహిత్, కోహ్లీ, అయ్యర్ డకౌట్
డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 గోవులు, దూడలు పట్టివేత
Kalyana Lakshmi | పెండ్లయి పిల్లలు పుట్టాక కల్యాణ లక్ష్మి చెక్కు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : వీడియో
NZvIND: సీఫర్ట్పైకి దూసుకెళ్లిన బ్రార్ .. భారత బౌలర్‌ను నియంత్రించిన కోహ్లీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

