GSLV-F10 : జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలం
జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలం | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన జీఎస్ఎల్వీ -ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలమైంది. క్రయోజనిక్ దశలో రాకెట్లో సమస్య ఎదురైంది. జీఎస్ఎల్వీ మిషన్ విఫలమైందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. రాకెట్ మూడో దశలో

హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన జీఎస్ఎల్వీ -ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలమైంది. క్రయోజనిక్ దశలో రాకెట్లో సమస్య ఎదురైంది. జీఎస్ఎల్వీ మిషన్ విఫలమైందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. రాకెట్ మూడో దశలో సాంకేతిక లోపంతో ప్రయోగం విఫలమైందని తెలిపారు. జీఎల్ఎల్వీ ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్లింది. నెల్లూరులోని శ్రీహరికోటలో సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసిన రాకెట్ మూడో దశలో విఫలమైనట్లు కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు తెలిపారు.
ఆ తర్వాత మిషన్ విఫలమైనట్లు పేర్కొన్నారు. క్రయోజెనిక్ దశలో సమస్యతో ప్రయోగం విజయవంతం కాలేదని మిషన్ కంట్రోల్ సెంటర్లోని రేంజ్ ఆపరేషన్ డైరెక్టర్ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. వాస్తవానికి రాకెట్ ప్రయోగం గతేడాది లోనే నిర్వహించాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి, సాంకేతిక సమస్యలతో పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ ద్వారా జీఐశాట్-1 ఉపగ్రహాన్ని భూమికి 36వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థ, ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టడం, వాటికి సంబంధించిన ముందస్తు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇస్రో ఈ మిషన్ను చేపట్టింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

