బిజినపల్లి : క్రీడలతో ( Sports ) సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని బీసీ జన చైతన్య జాతీయ నాయకులు అజయ్ కుమార్,రిటైర్డ్ డీఈవో విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం బిజీనాపల్లి మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉమ్మడి జిల్లా క్రికెట్ టోర్నమెంట్ను ( Cricket Tournament ) మాజీ మార్కెట్ చైర్మన్ కురుమయ్య ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతోపాటు ,క్రీడలు కూడా అంతే ముఖ్యమని అన్నారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని అన్నారు.ఆటలలో గెలుపోటములు సహజంగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, సింగిల్ విండో చైర్మన్ బాలరాజ్ గౌడ్, బీసీ సంఘం మండల అధ్యక్షులు సత్యశిల సాగర్,రాము నాయక్, పర్వతాలు, శీను, సత్యం, శ్రీశైలం, నిరంజన్ ,తదితరులు ఉన్నారు.