దేవరుప్పుల, జూన్ 27 : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై అనుచిత పోస్టులు పెట్టిన కాంగ్రెస్ యూత్ నాయకుడు, సోషల్ మీడియా ఆర్గనైజర్ లొడంగి అశోక్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ యూత్ నాయకుడు గడ్డం రాజు శనివారం జనగామ జిల్లా దేవరుప్పుల పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై సృజన్కుమార్కు ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కక్షతో మాజీ మంత్రి ఎర్రబెల్లిపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం, పరువుకు భంగం కలిగించే పోస్టులు పెడుతున్నరని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గుండె రమేశ్, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు పందెనబోయిన మధు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.