నాగర్ కర్నూల్: జీవితాంతం కమ్యూనిస్టుగా పేదప్రజల పక్షాన ఉన్నకందికొండ రామస్వామి ( Ramaswamy ) బాటలో నడిచి సోషలిస్టు వ్యవస్థ రావడానికి కృషి చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ( CPM State Secretary John Wesley) అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో సమావేశం హాల్లో ‘నెలపొడుపు ’ సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కామ్రేడ్ కందికొండ రామస్వామి స్మారక పురస్కార ప్రదానకార్యక్రమం సంస్థ కార్యదర్శి పి వహీద్ ఖాన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ప్రజాకవి గోరటివెంకన్న( Goreti Venkanna ) , ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ( MLA Rajesh Reddy ) ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ అవార్డుకు ఎంపికైన బల్కావ్ బ్యాక్ ప్యాక్ కథలు పుస్తక రచయత్రి ఊహకు అవార్డును ప్రదానం చేశారు. ఆమెను శాలువతో సత్కరించి రూ.10 వేలు నగదు బహుమతి అందచేశారు.
ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కందికొండ రామస్వామి కొరియర్గా పనిచేశారని గుర్తు చేశారు. పార్టీ విస్తరణకోసం కృషిచేశారని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తిని, చైతన్యాన్ని తీసుకొని ముందుకు సాగాలని కోరారు. ఎమ్మెల్సీ గోరటివెంకన్న మాట్లాడుతూ కందికొండ రామస్వామి ఆదర్శమైన జీవితం అందరికీ స్ఫూర్తి దాయకమని, కులమతాలతో సంబంధం లేకుండా తనను ఆదరించాడని ప్రశంసించారు. నేడున్న పరిస్థితుల్లో కమ్యునిజమే అజేయమని అన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ రామస్వామిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలలో నీతిగా ఉండేందుకు రాజకీయ నాయకులు ముందుకు సాగాలని కోరారు. అవార్డుకు ఎంపికైన బల్కావ్ బ్యాక్ కథల పుస్తకాన్ని కవి ఎదిరెపల్లి కాశన్న సమీక్ష చేశారు.
ఈ కార్యక్రమంలో కందికొండ మోహన్ ,మార్కెట్ చైర్మన్ రమణారావు, మాజీ జెడ్పీటీసీ నారాయణ గౌడ్, జెట్టి ధర్మరాజు, వంకేశ్వరం నిరంజన్, బోనాసి రాములు, సీపీఎం నాయకులు వర్దం పర్వతాలు, ఆర్.శ్రీనివాస్ లు, కందికొండ గీతమ్మ ,అబ్దుల్లా ఖాన్, గుడిపల్లి నర్సింహారెడ్డి, ఇంద్రకల్ వెంకటయ్య,వనపట్ల సుబ్బయ్య, ముచ్చర్ల దినకర్, ఖాజా, బాల్ రాం, వెంకట్ పవార్, హెచ్.రమేష్ బాబు, యోగానందం, కాశీదాసు, దేవరపాగ కృష్ణయ్య,మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.