శ్రీరాంపూర్, అక్టోబర్ 3 : శ్రీరాంపూర్ ఏరియా ఎస్పార్పీ -3 గనిలో శనివారం జరిగిన ప్రమాదంలో సపోర్ట్‌మెన్ దుర్గం శంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రూఫ్ బోల్టింగ్ స్పానర్స్ తయారు చేస్తున్న క్రమంలో జీఐ పైపును మిషన్ ద్వారా కట్ చేస్తుండగా జామ్ అయింది. మిషన్‌ను సరిచేసే సమయంలో అకస్మాత్తుగా మిషన్ ఆన్కావడంతో శంకర్ కుడి చేతివేలికి తీవ్ర గాయమైంది. వెంటనే తోటి కార్మికులు శంకర్‌ను ఆరే8 డిస్పెన్సరీకి అటునుంచి ఆరేపీ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఆపై హైదరాబాద్‌లోని కార్పొరేట్ హాస్పిటల్‌కు రెఫర్ చేశారు. ఏరియా దవాఖానకు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డిసురేందర్రెడ్డి, కేంద్ర సంయుక్త కార్యదర్శి రమేశ్, కార్యవర్గ సభ్యుడు సదయ్య, బ్రాంచ్ కార్యదుర్శులు మహిపాల్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అశోక్, చిన్నయ్య పరామర్శించారు.