న్యూఢిల్లీ: సీఎం రేఖా గుప్తా భర్త ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అని మాజీ సీఎం, ఆప్ నేత ఆతిశీ శనివారం ఆరోపించారు. రేఖ భర్త మనీశ్ గుప్తా ఎంసీడీ, డీజేబీ, పీడబ్ల్యూడీ, డీయూఎస్ఐబీ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్టు కనిపిస్తున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఓ మహిళ ముఖ్యమంత్రి కావడం, ప్రభుత్వ పనులన్నిటినీ ఆమె భర్త నిర్వహించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చునన్నారు. ‘ప్రభుత్వాన్ని ఎలా నడపాలో రేఖా గుప్తాకు తెలియదా? ఢిల్లీలో ప్రతి రోజూ చాలా సేపు విద్యుత్తు కోతలకు ఇదే కారణమా?’ అని తన పోస్ట్‌లో ఆతిశీ నిలదీశారు.