H9N2 Cases: చైనాలో హెచ్9ఎన్2 కేసులు.. రిస్క్ లేదన్న కేంద్ర సర్కార్
H9N2 Cases: చైనాలో హెచ్9ఎన్2 వైరస్ కేసులు ప్రబలుతున్నాయి. చిన్నారుల్లో నుమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయి. ఉత్తర చైనాలో ఆ కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. అయితే ఈ అంశంపై ఇవాళ భారత ప్రభుత్వం ప్రకటన చేసింది. చైనాలో ఉన్న హెచ్9ఎన్1 కేసులతో భారత్కు ఎటువంటి రిస్క్ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: చైనాలో ప్రస్తుతం హెచ్9ఎన్2 వైరస్ కేసులు( H9N2 Cases) ప్రబలుతున్నాయి. చిన్నారుల్లో నుమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయి. ఉత్తర చైనాలో ఆ కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. అయితే ఈ అంశంపై ఇవాళ భారత ప్రభుత్వం ప్రకటన చేసింది. చైనాలో ఉన్న హెచ్9ఎన్1 కేసులతో భారత్కు ఎటువంటి రిస్క్ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏవియన్ ఇన్ప్లుయాంజా కేసులతో పాటు, శ్వాసకోస వ్యాధుల సంఖ్య చైనాలో పెరుగుతున్నాయి. చిన్నారుల్లోనే ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత సర్కారు ప్రకటన చేయాల్సి వచ్చింది. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
పిల్లల్లో నమోదు అవుతున్న నుమోనియా కేసులకు కొత్త తరహా ప్యాథోజన్తో లింకు లేదని చైనా వెల్లడించినట్లు డబ్ల్యూహెచ్వో ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నది. అక్టోబర్ నుంచి చైనా పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు నమోదు అవుతున్నట్లు డేటా ప్రకారం తెలుస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే వ్యాధులకు సంబంధించిన మరింత డేటాను ఇవ్వాలని చైనాను కోరినట్లు డబ్ల్యూహెచ్వో పేర్కొన్నది. బీజింగ్లో కానీ, లియానింగ్లో కానీ ఎటువంటి కొత్త ప్యాథోజెన్స్ను గుర్తించ లేదని, అయితే పిల్లల్లో నుమోనియా కేసులు పెరగడానికి సాధారణ ప్యాథోజెన్లే కారణమని డబ్ల్యూహెచ్వో చెప్పింది.
.@MoHFW_INDIA is closely monitoring the outbreak of H9N2 and clusters of respiratory illness in children in China
There is a low risk to India from both the avian influenza cases reported from China as well as the clusters of respiratory illness
India is prepared for any kind… pic.twitter.com/hcIMzNTHtx
— PIB India (@PIB_India) November 24, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

