హైదరాబాద్ : మాదాపూర్ హైటెక్స్‌లో ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పోనుగోటి నవీన్‌రావు కూతురు వివాహ విందు కార్యక్రమానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు విందు కార్యక్రమానికి హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు.