అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసును సీఐడీచే విచారణ జరిపించాలని వివేకా కూతురు వైఎస్ సునీత ( YS Sunitha) ఏపీ సీఎం చంద్రబాబు (Chandra Babu) ను కోరారు. మంగళవారం సునీత దంపతులు విజయవాడలో చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకా హత్య కేసు(Viveka Murder Case) , వైసీపీ నేతల ప్రమేయం, పోలీసుల విచారణ తదితర అంశాలను ఆమె సీఎంకు వివరించారు. వివేకా హత్యకేసులో నిజాలు రాబట్టాలని కోరారు.
వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌తో పాటు తమపై పెట్టిన అక్రమ కేసు పెట్టారని వెల్లడించారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలు, రాంసింగ్‌పై కేసు వంటి అంశాలపై విచారణ చేయించాలని కోరారు. సీఐడీ (CID) విచారణ ద్వారా వాస్తవాలను బయటకు తేవాలని కోరారు. సునీత ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన సీఎం తనకు అన్ని విషయాలు తెలుసని, విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు.