సుబేదారి, జూన్19: భూ అక్రమణ ఫిర్యాదు విషయంలో బాధితుడికి న్యాయం చేస్తామని చెప్పి రూ.2 లక్షలు లంచం తీసుకుని కబ్జాదారుకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలొచ్చిన ధర్మసాగర్ సీఐ శ్రీధర్‌రావుపై పోలీ సు అధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టా రు. ఎకరం భూమిని అక్రమణదారుడికి రిజిస్ట్రేషన్ చేయాలని బాధితుడిని సీఐ బెదిరింపులకు గురిచేసినట్లు వెలుగులోకి రావడం వరంగల్ పో లీసు కమిషనరేట్‌లో హాట్‌టాఫిక్‌గా మారింది. తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు బొంపె ల్లి సుధీర్‌రావు గురువారం హైదరాబాద్‌లో డీజీపికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ విచారణకు ఆదేశించారు.
సీపీ ఆదేశాలతో వరంగల్ పోలీసు కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ అధికారు లు రంగంలోకి దిగారు. బాధితుడు సుధీర్‌రావు భూమి వివరాలు, న్యాయం చేస్తానని చెప్పి ధర్మసాగర్ సీఐ శ్రీధర్‌రావు రెండు విడుతలుగా తీసుకున్న రూ.2 లక్షల లంచం, చివరికి ఎకరం భూమి ఎదుటి పార్టీకి రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరింపులకు గురిచేసిన అంశాలపై వారు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. సీఐ ఎవరి ద్వారా డబ్బులు తీసుకున్నాడనే విషయమై వివరాలు సేకరించినట్లు తెలిసింది.
భూ అక్రమణదారుడికి సపోర్ట్ చేస్తూ, అతడికి ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేయాలని సుధీర్‌రావును బెదిరించిన వ్యవహారంలో సీఐ శ్రీధర్‌రావు తనపై సస్పెన్షన్ వేటు పడకుండా ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో పైరవీ చేస్తున్నట్లు తెలిసింది. తనను ఎలాగైనా కాపాడాలని సదరు సీఐ వరంగల్ పో లీసు కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగంలో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారిని ప్రాదేయపడినట్లు సమాచారం. సదరు అధికారి పోస్టింగ్ విషయం లో, సీఐ అవినీతి అక్రమాలకు కొంత సపోర్ట్‌గా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సదరు సీఐ అవినీతి వ్యవహారం ధర్మసాగర్ మండలంతోపాటు, పోలీసు కమిషనరేట్ పోలీసు వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.