సూపర్ స్టార్ రజనీకాంత్‌కు టాలీవుడ్ హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, వెంకటేష్ తమ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. 2019 సంవత్సరానికి గాను రజనీకాంత్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకోనున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వీరు విషెస్ అందించారు. నా ప్రియమైన స్నేహితుడికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించడం సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమకు మీరు చేసిన సేవలు అనిర్వచనీయం. ఈ అత్యున్నత పురస్కారం మీకు దక్కినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని చిరు తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఇక టాలీవుడ్ హీరో మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పొందినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. భారతీయ సినిమాకు మీరు చేసిన సేవలు అసమానం. ఎంతో మందికి మీరు ఆదర్శం అని అన్నారు. 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకోబోతున్న మీకు నా శుభాకాంక్షలు అంటూ వెంకీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Elated at the announcement of the prestigious #DadaSahebPhalke Award to my dear friend @rajinikanth Truly deserving.Your contributions to the film industry are immense my friend! Hearty congratulations! May the force be with you!! pic.twitter.com/OmU4mVQDhz
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 1, 2021
Congratulations @rajinikanth sir on being awarded the #DadasahebPhalkeAward!! Your contribution to cinema is unparalleled! Truly an inspiration👏👏👏
— Mahesh Babu (@urstrulyMahesh) April 1, 2021