పుట్టినరోజున అమ్మ ఆశీస్సులు తీసుకోలేకపోయానంటూ బాధపడ్డారు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల కోవిడ్ సోకిన కారణంగా క్వారంటైన్ లో ఉంటున్న చిరంజీవి..శనివారం తన మాతృమూర్తి అంజనాదేవి పుట్టినరోజును ఆమెతో కలిసి జరుపుకోలేకపోయారు. ఈ విషయంపై భావోద్వేగంగా ట్వీట్ చేశారు మెగాస్టార్. ‘అమ్మా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నేను క్వారంటైన్ లో ఉన్న కారణంగా ఇలా శుభాకాంక్షలు తెలుపాల్సివస్తున్నది. నీ దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మకూ కావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అభినందనలతో శంకరబాబు’ అని ట్వీట్ చేశారు చిరంజీవి. అమ్మ పిలుచుకునే తన సొంత పేరు శివశంకర వరప్రసాద్ ను గుర్తు చేస్తూ శంకరబాబు అని ట్వీట్ చేశారాయన.