బ్రెజిల్ పట్టణంలో కరోనాను కట్టడి చేసిన చైనా టీకా

సావ్ పౌలో: ఇప్పుడు ఎవరిని కదిలించినా టీకాల ముచ్చటే. ఏ టీకా బాగా పనిచేస్తుంది? ఎన్నిరకాల వైరస్‌లను అరికడుతుంది? అనే చర్చలే. ప్రపంచవ్యాప్తంగా కూడా రకరకాల టీకాల సామర్థ్యంపై అధ్యయనాలు, పరీక్షలు నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బ్రెజిల్‌లోని ఓ చిన్న పట్టణంలో జరిపిన అధ్యయనంలో చైనా తయారు చేసే సైనోవాక్ అనే టీకా కోవిడ్ విస్తరణను దీటుగ అడ్డుకుందని తేలింది. ప్రపంచంలోని అనేక పేద, వర్ధమాన దేశాలు ఈ వ్యాక్సిన్నే వినియోగిస్తున్నాయి. సెరానా అనే పట్టణంలో 45 వేల జనాభా ఉంటారు. వారందరికీ భారీ స్థాయిలో టీకాల పంపిణీ పూర్తి చేశారు. దాంతో మరణాల సంఖ్య 95 శాతం తగ్గిపోయింది. అలాగే లక్షణాలతో కూడిన కరోనా కేసులు 80 శాతం తగ్గిపేయాయి. ఆస్పత్రులలో చేరే కేసుల సంఖ్య 86 శాతం తగ్గిపోయింది. పట్టణ పౌరుల్లో 75 శాతం మంది టీకాలు తీసుకున్నారు. ఇక లక్షిత వయోవర్గంలో 95 శాతం మంది రెండు డోసులు పూర్తి చేశారు. తీవ్రమైన దుష్ప్రభావాలు ఎక్కడా కనిపించలేదు. రెండో డోసు పడిన 14 రోజుల తర్వాత కోవిడ్ మరణానికి గురైన సందర్భాలు కనిపించలేదు. టీకాలతో మహమ్మారిని అదుపు చేయగలమని నమ్మకం కుదిరినట్టు ఓ అధికారి చెప్పారు. పిల్లలకు కూడా టీకాలు ఇచ్చి స్కూళ్లు తెరవొచ్చని ఆయన పేర్కొన్నారు. గతనెల ఇండొనీషియాలో 1,30,000 మంది కార్మికులపై జరిపిన అధ్యయనంలోనూ చైనా వ్యాక్సిన్ 94 శాతం మందికి రక్షణ కల్పించినట్టు వెల్లడైంది. మరణాలు 96 శాతం, ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య 98 శాతం తగ్గిపోయింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

