చైనాది అణచివేత ధోరణి: అమెరికా విదేశాంగ మంత్రి

టోక్యో: అమెరికా కొత్త పాలకవర్గం కూడా చైనా తీరుపై తీవ్రంగా మండిపడింది. ఆసియా ప్రాంతంలో ఆ దేశం దూకుడుగా, అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌తో కలిసి ఆయన జపాన్, సౌత్ కొరియా పర్యటనల్లో ఉన్నారు. ఈ సందర్భంగా టోక్యోలో జపాన్ జర్నలిస్టులతో రౌండ్ టేబుల్ సమావేశంలో బ్లింకెన్ మాట్లాడారు. ఆసియా ప్రాంతంలో చైనా ఉద్రిక్తతలను పెంచుతోంది తప్ప తగ్గించడం లేదని ఆయన స్పష్టం చేశారు. దక్షిణ చైనా సముద్రంలో, తైవాన్ విషయంలో చైనా వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్భంగా బ్లింకెన్ ప్రస్తావించారు. బైడెన్ పాలకవర్గం తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. దక్షిణ చైనా సముద్రంపై సంపూర్ణ హక్కులు తమకే ఉన్నాయని వాదిస్తూ ఆ సముద్రంలో సైనిక స్థావరాలను కూడా చైనా ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది జపాన్‌కు రక్షణ సంబంధిత సవాళ్లను విసురుతోంది.
ఇంట్లో అణచివేత.. బయట దూకుడు
చైనా ఇంట అణచివేత ధోరణి, బయటి దేశాలతో దూకుడుగా వ్యవహరిస్తోంది. తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌ల విషయంలో చైనా తీరు ఆందోళన కలిగిస్తోంది అని బ్లింకెన్ అన్నారు. తూర్పు చైనా సముద్రంలోని సెంకాకస్ దీవులు జపాన్ నియంత్రణలో ఉన్నా చైనా మాత్రం అవి తమవే అని వాదిస్తోంది. మీడియాతో మాట్లాడే ముందు బ్లింకెన్, ఆస్టిన్.. జపాన్ విదేశాంగ, రక్షణ మంత్రులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత చైనా మంత్రులతోనూ వీళ్లు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా చైనా చర్యలపై తమ ఆందోళనలను తెలియజేస్తామని బ్లింకెన్ చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

