Chikiri Chikiri Song | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ ఇప్పటికే మొదటి లుక్, గ్లింప్స్‌తోనే అంచనాలు మించేశాయి. తాజాగా రిలీజ్ అయిన ‘చికిరి చికిరి’ లిరికల్ సాంగ్ మాత్రం అక్షరాలా సంచలనం సృష్టిస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ సాంగ్ 24 గంటల్లోనే 46 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక వ్యూస్ అందుకున్న పాటగా కొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం 13 గంటల్లోనే 32 మిలియన్ల వ్యూస్ సాధించడం మరో విశేషం. ఈ మాస్ బీట్‌కి సంగీతాన్ని అందించింది ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్. ఆయన స్వరాలతో పాటకు కొత్త లెవెల్ ఎనర్జీ వచ్చింది. మోహిత్ చౌహాన్ గాత్రం, బుచ్చిబాబు సాహిత్యం, రెహమాన్ సంగీతం కలసి ప్రేక్షకులను ఊపేస్తున్నాయి.

Chikri
‘చికిరి చికిరి’లో రామ్ చరణ్ ఎనర్జీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆయన వేసిన మాస్ హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరోయిన్ జాన్వీ కపూర్ సోయగాలు, స్టైలిష్ లుక్స్‌తో ఈ పాటకు మరింత అందాన్ని చేర్చాయి. మెగా అభిమానులకే కాకుండా, మ్యూజిక్ లవర్స్‌కి కూడా ఇది ఓ విజువల్ ఫీస్ట్‌గా మారింది. ఈ సాంగ్ విజయంతో ‘పెద్ది’పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమా రేంజ్‌ను మార్చేశాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మార్చి 27, 2026న ఈ భారీ పాన్ ఇండియా మూవీ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన చికిరి చికిరి పాటను ‘మోహిత్ చౌహన్’ పాడారు. నవంబర్ 7న విడుదలైన ఈ పాటకు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. పక్కా రూరల్ బీట్ తో రహమాన్ అందించిన మ్యూజిక్ కి ఆడియన్స్ తెగ ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాట వైబ్స్ వినిపిస్తున్నాయి. ఆలాగే, పాటలో రామ్ చరణ్ వేసిన గ్రేస్ ఫుల్ స్టెప్స్, జాన్వీ అందాలు అయితే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. దీంతో, ఈ పాటను రిపీట్ మోడ్‌లో వినేస్తున్నారు ఆడియన్స్. అయితే, ఈ నేపధ్యంలోనే సరికొత్త రికార్స్డ్ క్రియేట్ చేస్తోంది చికిరి సాంగ్. పెద్ది సినిమా నుంచి వచ్చిన మొదటిపాటకే ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం పట్ల పెద్ది మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మెగా ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీలవుతున్నారు.