‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియా సన్సేషన్‌గా మారింది. మొత్తం 13 దేశాల్లో టాప్ ట్రెండింగ్‌లో ఈ పాట ఉందని, నాలుగు భాషల్లో కలిపి 53 మినియన్ ప్లస్ వ్యూస్‌ని ఈ పాట సాధించిందని, టాప్ చార్ట్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉందని మేకర్స్ చెబుతున్నారు. ఇదిలావుంటే.. శనివారం రాత్రి హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో ఏ.ఆర్.రెహమాన్ మ్యూజికల్ నైట్ జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్ర హీరో రామ్‌చరణ్ సందడి చేశారు. ఆయనతోపాటు కథానాయిక జాన్వీకపూర్, ‘పెద్ది’ దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా హజరై ఆడియన్స్‌లో మరింత జోష్ నింపారు.
‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ సాంగ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామ్‌చరణ్ మాట్లాడుతూ ‘రెహ్మాన్సార్ సంగీతంతో భాగమవ్వాలనేది నా చిన్ననాటి కల. అది నా ‘పెద్ది’ సినిమాతో నెరవేరినందుకు చెప్పలేనంత సంబరంగా ఉంది.’ అని ఆనందం వెలిబుచ్చారు. ‘పెద్ది’ ఒక డిఫరెంట్, యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అని జాన్వీ కపూర్ అన్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.