హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్(హెచ్పీఎల్) ప్లేఆఫ్స్ బెర్తు కోసం మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. డిసెంబర్ 13న తొలి సీజన్ గ్రాండ్ ఫైనల్ జరుగనుండగా..ఈ వారం హెచ్పీఎల్ వీకెండ్ మ్యాచ్‌లకు అభిమానులతో పాటు స్టార్స్ మద్దతు గణనీయంగా పెరిగింది.
హైదరాబాద్ స్పోర్టింగ్ క్యాలెండర్లో హెచ్పీఎల్ కీలకంగా మారనుందని నిర్వాహకులు పేర్కొన్నారు. శని, ఆదివారాల్లో జరిగే వేర్వేరు మ్యాచ్‌ల్లో దాసోస్ డైనమోస్‌పై క్రెడికాన్ డైనమోస్ పైచేయి సాధించగా, కీర్తివారియర్స్పై, రాప్టర్స్ గెలిచింది. స్టారీ స్మాషర్స్‌తో పోరులో టైటాన్స్ సాధికారిక విజయం సాధించింది.