సోషల్ మీడియా (Social Media) వేదికగా తనను వేధింపులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కేరళ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఓ ఇన్స్టా ప్రొఫైల్ కొన్ని రోజుల క్రితం నా దృష్టికొచ్చింది. నేను, నా ఫ్యామిలీ, నా సహనటులే లక్ష్యంగా అసత్య ప్రచారాలతో కూడిన పోస్టులు ఆ ప్రొఫైల్లో కనిపించాయి. అందులో కొన్ని మార్ఫింగ్ ఫొటోలు కూడా ఉన్నాయి. నాపై ద్వేషంతో కొన్ని ఫేక్ అకౌంట్లను కూడా ఆ వ్యక్తి సృష్టించినట్టు తెలిసి షాకయ్యా. బాధపడ్డాను కూడా.
ఈ వ్యవహారం శృతి మించకూడదనే పోలీసులను ఆశ్రయించా. వారు కూడా వెంటనే స్పందించారు. చట్టవ్యతిరేకమైన ఈ చర్యలకు పాల్పడ్డ వ్యక్తిని వారు సత్వరమే కనిపెట్టారు. అయితే.. బాధ కలిగించే విషయం ఏంటంటే.. ఈ తప్పు చేసిన వ్యక్తి ఓ స్త్రీ. పైగా ఆమె 20ఏళ్ల యువతి. ఆమెది చాలా చిన్నవయసు. అందుకే.. ఆమె భవిష్యత్ పాడవ్వకూడదని వివరాలు పంచుకోవడం లేదు.’ అంటూ చెప్పుకొచ్చారు అనుపమ పరమేశ్వరన్.