ముంబై: ఐపీఎల్ 2021 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) బ్యాట్స్‌మన్ చెతేశ్వర్ పుజారా సన్నద్ధమవుతున్నాడు. ముంబైలో సహచర ఆటగాళ్లతో పుజారా బ్యాటింగ్ సాధన చేస్తున్నాడు. నెట్ ప్రాక్టీస్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో పుజారా సిక్సర్లు బాదేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా ఏండ్ల నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉన్న పుజారా టీ20 క్రికెట్ ఎలా ఆడుతాడో ఆసక్తికరంగా మారింది. 2014 తర్వాత పుజారా ఐపీఎల్ ఆడబోతుండటం ఇదే తొలిసారి.
ఐపీఎల్ 2021 కోసం నిర్వహించిన వేలంలో రూ.50లక్షల కనీస ధరకు చెన్నై పుజారాను దక్కించుకుంది. టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడిన పుజారా రాబోయే టోర్నీలో తుది జట్టులో చోటు దక్కితే తన సత్తాఏంటో చూపించాలనుకుంటున్నాడు.
Puji was on fire 🔥@cheteshwar1 #csk pic.twitter.com/CNbPXi786q
— Ravi Desai 🇮🇳 (@its_DRP) March 30, 2021